News April 18, 2024

23న పవన్ కళ్యాణ్ నామినేషన్

image

AP: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలైంది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జనసేన Xలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారని తెలిపింది.

Similar News

News October 26, 2025

తుఫాన్: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

image

AP: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
* 27, 28 తేదీలు: తూ.గో, అన్నమయ్య, కడప జిల్లాలు
* 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలు
> కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. అటు మరిన్ని జిల్లాలకు హాలిడే ఇచ్చే అవకాశం ఉంది.

News October 26, 2025

పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

image

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.

News October 26, 2025

నిమిషాల్లోనే అదృష్టం మారి’పోయింది’!

image

మధ్యప్రదేశ్‌‌కు చెందిన వినోద్ డోంగ్లీ అనే నోటరీ లాయర్ కొన్ని నిమిషాలపాటు బిలియనీర్‌గా మారారు. తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే రూ.2,817 కోట్ల విలువైన 1,312 హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్లు కనిపించడంతో షాకయ్యాడు. ఇది నిజమే అని సంభ్రమాశ్చర్యంలో మునిగిపోగానే ఆ షేర్లన్నీ తన ఖాతాలోంచి మాయమైపోవడంతో కంగుతిన్నారు. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరగడంతో తన అదృష్టం కాసేపే అని నవ్వుకున్నారు.