News November 30, 2024
పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి: అంబటి

AP: కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల పాత్ర ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘రేషన్ అక్రమ రవాణాను పవన్ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఆయన ప్రభుత్వంలో ఉన్నారో లేదో అర్థం కావడం లేదు. పవన్ ఇంకా ప్రశ్నించే ధోరణిలోనే ఉన్నారా? ఆయన అసమర్థుడనే విషయం అర్థమవుతోంది. రేషన్ అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ పవన్, నాదెండ్ల రాజీనామా చేయాలి’ అని అంబటి డిమాండ్ చేశారు.
Similar News
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్లు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై పలు గ్రామాల ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని అందులో పేర్కొన్నారు. వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు రిజర్వేషన్లను సవాల్ చేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్కు PMను ఆహ్వానించాలి: సీఎం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.