News April 10, 2024
ప్రజల కోసం నిలబడ్డ హీరో పవన్ కళ్యాణ్: CBN
AP:ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. ‘అక్రమాలు, వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ నిలబడ్డారు. శిథిలమైన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మోదీ మద్దతు అవసరం. మూడు పార్టీలు కలిశాయి. ఇక YCPకి డిపాజిట్లు వస్తాయా? యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పారిపోతారు. విధ్వంస పాలన కావాలో? అభివృద్ధి పాలన కావాలో? యువతకు ఉద్యోగాలు కావాలో? గంజాయి కావాలో? ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.
Similar News
News November 15, 2024
జర్నలిస్టుపై కోర్టుకు వెళ్తా: ఇమానే ఖెలీఫ్
అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ పుట్టుకతో పురుషుడేనని తేలినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై ఇటలీ PM మెలోనీ సైతం ఖెలీఫ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై బాక్సర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఆ జర్నలిస్టుపై నేను కోర్టుకు వెళ్లనున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 15, 2024
మహిళా ఎంపీ గొప్ప మనసు.. పేద బాలికల కోసం!
NDAలో యంగెస్ట్ ఎంపీగా పేరొందిన శాంభవి చౌదరి తన ఐదేళ్ల జీతాన్ని అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘చదువుకుంటేనే సమస్తిపూర్ వృద్ధి చెందుతుంది’ అనే నినాదంతో ఆమె తన శాలరీని ఖర్చు పెట్టనున్నారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
News November 15, 2024
గంభీర్, రోహిత్‌తో విరాట్‌కు విభేదాలున్నాయి: మాజీ క్రికెటర్
కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీకి విభేదాలున్నాయని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ బ్రెండన్ జూలియన్ అన్నారు. ‘కోహ్లీ న్యూజిలాండ్‌పై ఔటైన తీరు నమ్మశక్యంగా లేదు. అది అతడి ఆట కాదు. తన కెప్టెన్, కోచ్‌తో అతడికి సయోధ్య లేదనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇబ్బంది పడతారు. కెప్టెన్‌గా, బౌలర్‌గా బుమ్రా కూడా ఇబ్బంది పడతారు. పెర్త్‌లో ఆస్ట్రేలియా భారత్‌పై సునాయాసంగా గెలుస్తుంది’ అని జోస్యం చెప్పారు.