News April 5, 2025

నేడు భద్రాచలానికి పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భద్రాచలానికి వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారు. ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ మాదాపూర్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. పవన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News January 19, 2026

KNR: మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

image

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, పెద్దపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, నిజామాబాద్‌(జగిత్యాల, కోరుట్ల) బాధ్యతలను ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి అప్పగించారు. మంత్రుల రాకతో స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

News January 19, 2026

ఉన్నావ్ అత్యాచార కేసు.. కుల్దీప్ సెంగార్‌కు చుక్కెదురు

image

ఉన్నావ్ <<18703366>>అత్యాచార<<>> ఘటనలో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో విధించిన పదేళ్ల జైలు శిక్షను నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది. శిక్షను సవాలు చేస్తూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అతడికి బెయిల్ ఇచ్చేందుకూ ధర్మాసనం అంగీకరించలేదు.

News January 19, 2026

మళ్లీ ఇండియాకు రాను: విదేశీయురాలు

image

ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికన్ మహిళకు ఢిల్లీ మెట్రోలో చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ సాకుతో వచ్చిన ఓ టీనేజ్ బాలుడు ఆమె బ్రెస్ట్‌ను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణాన్ని అబ్బాయి తల్లి వెనకేసుకొస్తూ అది ‘ఓవర్ యాక్షన్’ అని కొట్టిపారేయడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ‘ఇకపై భారత్‌కు, దక్షిణాసియాకే రాను’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉంది.