News June 29, 2024
నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు రానున్నారు. ఇక్కడ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం గంటన్నరపాటు ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవోతో కలిసి తెలంగాణ జనసేన నేతలు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో రోడ్డు మార్గాన బయల్దేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు.
Similar News
News August 31, 2025
విద్యార్థులకు రాగిజావ.. 40% ఖర్చు భరించనున్న ప్రభుత్వం!

TG: సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వారానికి 3 రోజులపాటు రాగిజావను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అయ్యే ఖర్చులో 40% భరించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. మిగతా ఖర్చును శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు భరిస్తుంది. ట్రస్టుతో కలిసి గత రెండేళ్లుగా ప్రభుత్వం రాగిజావను అందిస్తోండగా, ఈ ఏడాది ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మళ్లీ రాగిజావ పంపిణీ ప్రారంభం కానుంది.
News August 31, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220గా ఉంది. గుంటూరు, చిత్తూరులో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అటు హైదరాబాద్లో రూ.200-220, వరంగల్లో రూ.210, ఖమ్మం, నల్గొండలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. కేజీ మటన్ ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉంది. మీ ఏరియాలో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
News August 31, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు <<17568780>>సన్నాహకాలు<<>> మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా, మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో? డబ్బులు రాకపోతే నిర్మాణమెలా? అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.