News June 18, 2024
నేడు సచివాలయానికి పవన్ కళ్యాణ్

AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం CM చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News April 8, 2026
భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ వార్నింగ్

ట్రంప్ తన హెచ్చరికలను నిజం చేస్తూ దాడులకు దిగితే ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ మిలటరీ వర్గాలు తెలిపాయి. US, దాని భాగస్వామ్య దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాయి. ఇక ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను 2 వారాలు పొడిగించాలని పాక్ PM షరీఫ్ కోరారు. రెండు వారాల పాటు హార్ముజ్‌ను తెరవాలని ఇరాన్‌కు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలు సీజ్‌ఫైర్ పాటించాలన్నారు.
News April 8, 2026
PHOTO GALLERY: ముంబైvsరాజస్థాన్

IPL: ముంబై, రాజస్థాన్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. వర్షం పడటంతో పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ RR ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. 5 ఓవర్లలోనే 80 రన్స్ చేసి RR భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. RR బౌలర్లు సైతం న్యూ బాల్‌తో రాణించారు. ముంబై బ్యాటర్లను వెనువెంటనే పెవిలియన్‌కు పంపి ఈ సీజన్‌లో మూడో విజయం సాధించి టేబుల్ టాపర్ అయ్యారు.
News April 8, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


