News September 24, 2024
అక్టోబర్ 1న తిరుమలకు పవన్ కళ్యాణ్

AP: అక్టోబర్ 1న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి రావడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న శ్రీవారిని దర్శించుకుని ఆయన దీక్షను విరమిస్తారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తారు.
Similar News
News December 3, 2025
ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.
News December 3, 2025
రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.


