News January 9, 2025

నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. పవన్ తిరుమల వెళ్లేందుకు ఇవాళ్టి తన పర్యటనలు అన్నీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News February 27, 2026

సాగర్‌లో తగ్గుతున్న నీటి నిల్వలు!

image

TG: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 537 అడుగుల మేరకు 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 51 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రానున్న రోజుల్లో తాగు, సాగు అవసరాలకు 65 టీఎంసీల అవసరం ఉందని తెలిపారు. అందువల్ల కనీస నీటిమట్టాన్ని కొనసాగించేందుకు కుడి, ఎడమ కాలువలకు జలాల విడుదలలో నియంత్రణ అవసరమని పేర్కొన్నారు.

News February 27, 2026

IMMTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>CSIR<<>>-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(IMMT) 9 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE/BTech, ME/MTech, MSc(జియాలజీ, కెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మార్చి 18న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.immt.res.in

News February 27, 2026

రాష్ట్రంలో పరువు హత్య.. దారుణంగా చంపేశారు

image

AP: తూ.గో జిల్లా ద్వారపూడిలో పరువు హత్య కలకలం రేపింది. రాయవరం డిప్యూటీ తహశీల్దార్ సంధ్య(40), ద్వారపూడికి చెందిన సూర్యప్రకాశ్ రావు(41) నిన్న ఉదయం అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య సోదరులు ద్వారపూడి వెళ్లి బైక్‌పై వస్తున్న నూతన దంపతులను అడ్డుకున్నారు. ఆగ్రహంతో సూర్యప్రకాశ్‌ను రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత స్థానికులు నిందితులను చితకబాది, పోలీసులకు అప్పగించారు.