News October 17, 2024
అన్నాడీఏంకేకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ తాను ఆరాధించే గొప్ప నాయకుడని, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని, ఆమె అడుగుజాడల్లో పార్టీ మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. తమిళ భాష, సంస్కృతి, వారి పోరాట పటిమ పట్ల తనకెంతో గౌరవముందని పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత

తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి(97) తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన ఆమె ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాట పాడారు. ఆరేళ్ల వయసు నుంచే పాడటం మొదలెట్టిన బాలసరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2 వేలకు పైగా పాటలు ఆలపించారు. పలు సినిమాల్లో నటించారు.
News October 15, 2025
పాదాలు తెల్లగా అవ్వాలంటే..

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను క్లీన్ చేశాక తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. బయటకు వెళ్లేటపుడు సన్స్క్రీన్ రాసుకోవాలి. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ C, హైడ్రోక్వినోన్లున్న లైటెనింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
News October 15, 2025
దారులు వేరైనప్పుడు KCR ఫొటో పెట్టుకోవడం కరెక్ట్ కాదు: కవిత

TG: కేసీఆర్ ఫొటో లేకుండానే ‘జాగృతి జనం బాట’ చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ‘ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం. కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా KCR పేరు చెప్పుకోవడం నైతికంగా కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను వేరే తొవ్వ వెతుక్కుంటున్నా. గతంలో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫొటో పెట్టకుండా జయశంకర్ ఫొటోనే పెట్టాం’ అని చెప్పారు.