News October 5, 2024

MGR వీరాభిమానులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

image

తమిళనాట రాజకీయాల్లో కీలక పార్టీ ‘ఏఐఏడీఎంకే’ ఏర్పాటై ఈ నెల 17కు 53ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు MGR ఫ్యాన్స్‌కు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పురచ్చి తలైవర్’ MGRపై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని తెలిపారు. పవన్‌ను వ్యతిరేకిస్తున్న డీఎంకే సర్కారుకు చెక్ పెట్టేలా ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా పవన్ ట్వీట్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Similar News

News April 2, 2026

రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన!

image

AP: రాష్ట్రంలోని గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 20రోజుల కిందటే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం మొన్నటితో ముగిసింది. దీంతో కొత్త SEC వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

News April 2, 2026

KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!

image

IPL: కోల్‌కతా వేదికగా ఇవాళ KKR, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచుల్లో ఇరుజట్లు ఓటమి చెందాయి. దీంతో ఇవాళ గెలిచి బోణీ కొట్టాలని కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్‌లు 30 సార్లు తలపడగా KKR 20 సార్లు విజయం సాధించింది. కోల్‌కతాలో అయితే 11 సార్లు పోటీపడగా 8 గెలుపులతో KKRదే పైచేయిగా ఉంది. బ్యాటింగ్‌లో ఇరుజట్లు బలంగానే ఉన్నా బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనత కన్పిస్తోంది.

News April 2, 2026

ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

image

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>