News November 23, 2024
‘మహాయుతి’కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
మహారాష్ట్రలో ‘మహాయుతి’ మెజార్టీ స్థానాల్లో గెలవడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజనరీ ప్రధాని మోదీ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచారని.. నిజాయితీ, అభివృద్ధికి ఓటేశారని పేర్కొన్నారు. ఫడణవీస్, ఏకనాథ్ శిండే, అజిత్ పవార్ సమష్టిగా పోరాడారని కొనియాడారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున మహారాష్ట్రలో తాను ప్రచారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి స్పెషల్ అప్‌డేట్.. ఎప్పుడంటే..
రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ అప్‌డేట్స్ వరద పారిస్తోంది. ఇప్పటికే మూవీలో జరగండి జరగండి, రా మచా మచా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట రానుంది. రేపు ఉదయం 11.07 గంటలకు దానికి సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు గేమ్ ఛేంజర్ టీమ్ ప్రకటించింది. ‘ది సీజన్ ఆఫ్ లవ్ స్టార్ట్స్ టుమారో’ అన్న క్యాప్షన్‌తో ఇది మెలోడీ సాంగ్ అని ట్విటర్‌లో హింట్ ఇచ్చింది.
News November 23, 2024
తీవ్ర ఉత్కంఠ.. నాందేడ్‌లో కాంగ్రెస్ విజయం
MHలోని నాందేడ్ లోక్‌సభ సీటు ఉపఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. BJP, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడింది. చివరకు 1,457 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్‌రావ్ గెలిచారు. రవీంద్రకు 5,86,788 ఓట్లు రాగా, BJP అభ్యర్థి సంతుక్‌రావ్ హంబార్డేకు 5,85,331 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఆయన కుమారుడు రవీంద్రకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
News November 23, 2024
అదృష్టం: 162 ఓట్లతో గెలిచాడు!
మహారాష్ట్రలోని మాలేగావ్ సెంట్రల్ నియోజకవర్గంలో MIM పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ కేవలం 162 ఓట్ల తేడాతో గెలిచారు. ఇస్మాయిల్‌కు 1,09,653 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ఆసిఫ్ షేక్ రషీద్ (ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర పార్టీ)కు 1,09,491 ఓట్లు పోలయ్యాయి. ఆ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. MHలో MIM 16 సీట్లలో పోటీ చేయగా గెలిచిన ఏకైక సీటు ఇదే.