News October 7, 2024

అదృష్టంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు: కాంగ్రెస్ ఎంపీ

image

రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు ఎంపీ(INC) తిరునావుక్కరసర్ మండిపడ్డారు. ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. తమిళనాడు నేతలను విమర్శించే స్థాయి ఆయనకు లేదని, అంతపెద్ద నాయకుడేమీ కాదని చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అని, వీధుల్లో వెలిసే విగ్రహం వంటివారని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

జగిత్యాల: ఎన్నికల నిఘాకు ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల ప్రారంభం

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించిన 3 ఎస్‌ఎస్‌టీ, 20 ఎఫ్‌ఎస్‌టీ బృందాలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, స్క్వాడ్‌ల కార్యాచరణ, అనుసరించాల్సిన విధానాలపై వివరాలు అందించారు. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలెక్టరేట్ ఆవరణలో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించి బృందాలను విధులకు తరలించారు.

News November 28, 2025

భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 28, 2025

స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

image

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్‌’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.