News April 24, 2024

పవన్ కళ్యాణ్ ఆస్తులు రూ.163 కోట్లు

image

AP: తన కుటుంబానికి రూ.163 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో రూ.46 కోట్లు చరాస్తులు కాగా రూ.118 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక అతడి వద్ద రూ.14 కోట్ల విలువైన కార్లు, బైక్‌లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌కు రూ.65 కోట్ల అప్పులు ఉన్నాయి. వదిన సురేఖ నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకున్నారు. పదవ తరగతి వరకు చదివారు. ఆయనపై 8 క్రిమినల్ కేసులున్నాయి.

Similar News

News November 15, 2025

రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

image

రైలులో తక్కువ ధరకే వస్తువులను <>పార్సిల్<<>> చేయొచ్చు. ‘పార్సిల్ అండ్ లగేజ్ సర్వీస్’ కింద వస్తువులు, కార్లు & బైక్స్‌ను రైలులో పంపొచ్చు. ఏ వస్తువునైనా దృఢమైన పెట్టెల్లో లేదా సంచుల్లో ప్యాక్ చేయాలి. బైక్ పంపిస్తే RC, ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. బరువు & దూరం ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. వారిచ్చిన రసీదును స్టేషన్‌లో చూపించి బైక్ కలెక్ట్ చేసుకోవచ్చు. ‘పార్సిల్ ఇన్సూరెన్స్’ తీసుకుంటే నష్టపరిహారం పొందొచ్చు.

News November 15, 2025

BREAKING: అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ అని సూచించింది.

News November 15, 2025

గ్యాస్‌లైటింగ్ గురించి తెలుసా?

image

మానసిక వేధింపుల్లో ‘గ్యాస్‌లైటింగ్’ ఒకటి. దీన్ని అనుసరించే వారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారితో స్నేహం చేస్తూనే వారిని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో తమపై తమకు నమ్మకం పోయేలా, తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. మానసికంగా బలహీనంగా ఉండే వారితో ఇలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారిని క్రమంగా బలహీనుల్ని చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడమే వీరి లక్ష్యం.