News November 28, 2024
రాజ్యసభకు పవన్ కళ్యాణ్ సోదరుడు?

AP: జనసేన నేత నాగబాబును రాజ్యసభకు పంపే ప్రయత్నాల్లో Dy.CM పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 స్థానాల్లో ఒకటి తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఎన్డీఏ పెద్దలతో ఇదే విషయాన్ని ప్రస్తావించారని టాక్. కాగా లోక్సభ ఎన్నికల్లోనే అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా కూటమి సీట్ల పంపకాల్లో ఆ స్థానం BJPకి వెళ్లింది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపాలని పవన్ భావిస్తున్నారు.
Similar News
News November 29, 2025
పేదల కోసం అర్ధరాత్రి వరకూ ఉంటా: CJI

తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలకు చోటుండదని.. పేద కక్షిదారులే తన తొలి ప్రాధాన్యత అని CJI సూర్యకాంత్ స్పష్టంచేశారు. తిలక్ సింగ్ డాంగీ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత ఆయన స్పందిస్తూ.. “చివరి వరుసలో ఉన్న పేదవారి కోసం నేను ఇక్కడ ఉన్నాను. అవసరమైతే అర్ధరాత్రి వరకూ కోర్టులో కూర్చుంటాను” అని అన్నారు. సంపన్నులు వేసే అనవసర కేసులకు సమయం వృథా చేయబోనని వ్యాఖ్యానించారు.
News November 29, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్(81) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్తో కాన్పూర్లో తుదిశ్వాస విడిచారు. ఈయన 2004-2009 వరకు హోంశాఖ సహాయ మంత్రిగా, 2011-2014 మధ్య కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి కావడానికి ముందు 2000-2002 వరకు ఈయన UPCC అధ్యక్షుడిగా సేవలందించారు. శ్రీప్రకాశ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నేతలు సంతాపం తెలిపారు.
News November 29, 2025
నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు

1759: గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నౌలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా మరణం(ఫొటోలో)
2009: తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం


