News April 24, 2024

పవన్ కళ్యాణ్ అప్పులు రూ.64.26 కోట్లు

image

AP: ఐదేళ్లలో తన సంపాదన రూ.114.76 కోట్లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తెలిపారు. పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.73.92 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మరో రూ.20 కోట్లను విరాళాలుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తనకు రూ.64.26 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకులు, వ్యక్తుల నుంచి ఈ అప్పులు తీసుకున్నట్లు వివరిస్తూ జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Similar News

News February 5, 2026

WPL Final: ఢిల్లీ భారీ స్కోరు

image

WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్ జెమీమా(57), లారా (44), లిజెల్లీ లీ(37) రాణించారు. చివర్లో చినెల్లీ హెన్రీ(35*) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. సయాలి, అరుంధతి రెడ్డి, డి క్లెర్క్ తలో వికెట్ తీశారు. బెంగళూరు టార్గెట్ 204.

News February 5, 2026

ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు: తండ్రి

image

కొందరు అమ్మాయిలు కొరియన్ కల్చర్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. ఘజియాబాద్‌లో <<19055978>>ముగ్గురు<<>> అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు కారణం కొరియన్ గేమ్స్ ఆడనివ్వకపోవడమే. ‘నా కూతుళ్లు కొరియాకు తీసుకెళ్లమని అడిగేవారు. మనం ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు. ఒరిజినల్ పేర్లను అలిజా, సిండీ, మారియాగా మార్చేసుకున్నారు’ అని తండ్రి చెప్పారు. దీంతో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. Comment?

News February 5, 2026

VASTHU: అలాంటి ఇల్లు ఆలయంతో సమానం!

image

క్రమశిక్షణతో కూడిన భక్తి ఉన్న ఇల్లు ఆలయంతో సమానమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అన్నారు. అచంచలమైన నమ్మకంతో ఇంటి పూజా మందిరంలో కొలువైన దేవతలను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నారు. ‘ఆగమశాస్త్రయుక్తంగా ప్రాణప్రతిష్ట జరిగిన గుడిలోని మూర్తుల నుంచి శక్తి తరంగాలు వెలువడతాయి. ఇంట్లో వాస్తు రీత్యా దైవపటాలను ఉంచి భక్తితో పూజించినప్పుడు, ఆ ఏకాగ్రతే అక్కడ సాత్విక శక్తిని నింపుతుంది’ అని చెప్పారు. <<-se>>#VASTHU<<>>