News September 4, 2025

పిఠాపురం టీచర్లకు పవన్ కానుక

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ఉపాధ్యాయులకు చిరు కానుక అందజేశారు. SEP 5న గురుపూజోత్సవం నేపథ్యంలో టీచర్లకు వస్త్రాలు బహుమతిగా పంపారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 2 వేలమంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు, జూ.కాలేజీల లెక్చరర్లకు బహుమతులు పంపారు. మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు షర్టు-ప్యాంటు అందజేశారు.

Similar News

News January 30, 2026

కొన్ని సినిమాలు మహిళలను వాడుకోవడానికే తీస్తున్నారు: తమ్మారెడ్డి

image

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి కామెంట్స్‌తో సింగర్ <<18970537>>చిన్మయి<<>> విభేదించడంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘ఆమె చెప్పింది నిజమే. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే ధోరణి పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో ఉంది. అయితే అందరూ వేధింపులకు పాల్పడటం లేదు. ఏడాదికి 250 సినిమాలు నిర్మిస్తే 30-40 చిత్రాలు మహిళలను వాడుకోవడానికే తీస్తున్నవి. ఇది కాదనలేని వాస్తవం’ అని వ్యాఖ్యానించారు.

News January 30, 2026

వరాహ స్వామి, ఆదివరాహ స్వామి.. ఇద్దరూ ఒకరేనా?

image

వీరిద్దరూ ఒకే పరమాత్మ స్వరూపాలు. కానీ సందర్భాన్ని బట్టి పిలుస్తారు. సత్యయుగంలో భూమిని ఉద్ధరించడానికి విష్ణుమూర్తి ధరించిన అవతారాన్ని వరాహ స్వామి అంటారు. అయితే అన్ని వరాహ రూపాలకు మూలమైనవాడు, తిరుమల క్షేత్రంలో శ్రీవారి కన్నా ముందే వెలిసినవాడు కాబట్టి ఆయనను ఆది వరాహ స్వామి అంటారు. ‘ఆది’ అంటే మొదటివాడని అర్థం. ప్రళయ కాలంలో భూమిని రక్షించి, తిరిగి స్థాపించిన జగద్గురువుగా ఆయనకు ఈ విశిష్ట నామం దక్కింది.

News January 30, 2026

కొబ్బరి మొక్కల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.