News June 21, 2024

పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

image

AP: అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అటు ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలన్నారు. గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News November 18, 2025

అనకాపల్లి జిల్లాలో 2,841 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు: సీఎండీ పృథ్వీరాజ్

image

అనకాపల్లి జిల్లాలో 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,841 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్ సోమవారం తెలిపారు. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. 500 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.18,000 రాయితీ లభిస్తుందన్నారు. తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వినియోగదారులు PM సూర్యఘర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పెదాలు పగులుతున్నాయా?

image

శీతాకాలంలో పెదాలు తరచూ పొడిబారి పగిలిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే వెన్న, నిమ్మరసం, దోస, టమాటా గుజ్జు పూయాలి. లిప్‌బామ్ రాయడం మర్చిపోకూడదు. రాత్రి పడుకునే ముందు నేతితో పెదాలను మర్దనా చేయడం వల్ల కూడా పెదాలు మృదువుగా ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. అలాగే మంచి పోషకాహారం, తగినంత నిద్ర మిగతా శరీర భాగాల్లాగే పెదాలకూ అవసరం. కాబట్టి జీవనశైలి బావుండేలా చూసుకోవాలి.