News May 27, 2024
OGలో పవన్ కళ్యాణ్ పేరు ‘ఓజాస్ గంభీర’: సుజీత్

OG సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ‘ఓజాస్ గంభీర’ అని దర్శకుడు సుజీత్ వెల్లడించారు. కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ ప్రమోషన్స్‌లో భాగంగా OG సినిమా విశేషాల్ని పంచుకున్నారు. మొదట పవన్ తనను రీమేక్ కోసం పిలిచారని, తర్వాత కొత్త కథ ఏదైనా ఉందా? అని అడిగితే OG స్టోరీ చెప్పానని తెలిపారు. అది ఆయనకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కిందని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2026
అణు ఒప్పందంపై ఇరాన్, అమెరికా చర్చలకు డేట్ ఫిక్స్

అణు ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్, యూఎస్ ప్రతినిధుల భేటీకి తేదీ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మస్కట్‌లో చర్చలు జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ ట్వీట్ చేశారు. అంతకుముందు అణు ఒప్పందానికి రాకపోతే దాడి తప్పదని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఘాటుగానే <<19025631>>బదులిచ్చినా<<>> తాజాగా చర్చలకు అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.
News February 5, 2026
ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

✒1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒1990: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్(ఫొటోలో) జననం
News February 5, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


