News April 14, 2024

జగన్‌కు గాయంపై పవన్ కళ్యాణ్ స్పందన

image

AP: సీఎం జగన్‌పై నిన్న జరిగిన దాడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘రాయి పడింది అని.. రాష్ట్రానికి గాయమైందని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. అక్కను ఏడిపిస్తున్నారని ఎదిరించిన 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్‌ను చెరుకు తోటలో పెట్రోల్ పోసి కాల్చేశారు. పసిబిడ్డను కాల్చేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా?’ అని తెనాలి సభలో పవన్ ప్రశ్నించారు.

Similar News

News March 10, 2026

ఇండిగో సీఈఓ రాజీనామా

image

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు బోర్డ్ ఆమోదం తెలపగా ఆయన స్థానంలో ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలను చేపడతారు. డిసెంబరులో 2,500కుపైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ కావడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ రిజైన్ చర్చనీయాంశమైంది. ఈ క్రైసిస్‌పై కేంద్రం ఆ సంస్థకు జనవరిలో ₹22కోట్ల పెనాల్టీ విధించింది.

News March 10, 2026

బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చెప్పండి: మనోహర్

image

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు గ్యాస్ కొరత లేదని, గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ల నిల్వలు, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా నిఘా బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఎక్కడైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 10, 2026

చమురులో రకాలు.. ఈ విషయం తెలుసా?

image

అమెరికా, వెనిజులా, ఇరాన్, రష్యాలో లభించే చమురులో ఉండే వ్యత్యాసాల గురించి మీకు తెలుసా? అమెరికాకు చెందిన WTI (39–41° API) అత్యంత తేలికైనది కాగా వెనిజులాకు చెందిన Merey (15–16° API) అత్యంత బరువైనది. ఇరాన్ చమురు (33–36° API) మధ్యస్థంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా అనేక రిఫైనరీలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో సరఫరా నిలిస్తే, రిఫైనరీల సామర్థ్యం తగ్గి లాభాలు పడిపోతాయి.