News June 29, 2024
1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తొలిరోజు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో సమావేశమవుతారు. 2న కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం జనసేన MLAలు, MPలతో భేటీ కానున్నారు. 3న ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు.
Similar News
News February 7, 2026
TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
News February 7, 2026
ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.
News February 7, 2026
TISSలో ఉద్యోగాలు

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<


