News December 23, 2024

నేడు కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కంకిపాడు మండలం గుడువర్రులో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అధికారులతో చర్చిస్తారు.

Similar News

News January 6, 2026

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

image

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్‌ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్‌ (లేదా) 2mlహెక్సాకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్‌ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేయాలి.

News January 6, 2026

విద్యా వ్యవస్థలో మార్పులతోనే ఉద్యోగాలు!

image

విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ కోచింగ్ <<18774837>>సెంటర్ల<<>> చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా ‘నైపుణ్యాధారిత విద్య’ను అందించాలి. సిలబస్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. క్యాంపస్ నుంచే విద్యార్థులు జాబ్స్ సాధించేలా స్కిల్స్ పెరిగితేనే విద్యా వ్యవస్థ సక్సెస్ అయినట్లు. ఏమంటారు?

News January 6, 2026

పెరిమెనోపాజ్ ఇబ్బందులకు చెక్

image

మెనోపాజ్ దశకు ముందుగా వచ్చేదే పెరిమెనోపాజ్. ఈ సమయంలో మహిళల్లో ఎన్నో మార్పులొస్తాయి. హార్మోన్లు అస్తవ్యస్తం కావడం, వేడిఆవిర్లు, నిద్ర అస్తవ్యస్తం కావడం, నిరాశ, నిస్పృహ, గుండెదడ, జీర్ణసమస్యలు, మతిమరుపు వంటి సమస్యలు దాడి చేస్తాయి. వీటిని తగ్గించడానికి వ్యాయామం, హెల్తీ ఫుడ్, యోగా, ధ్యానం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర ఉపయోగపడతాయి. సమస్య తీవ్రంగా ఉంటే కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీకి వెళ్లాలి.