News March 26, 2025
ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాలు, అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు మొగల్తూరులో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News March 28, 2025
BREAKING: టెన్త్ పరీక్ష వాయిదా

AP: ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్ను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.
News March 28, 2025
ధోనీ క్రేజ్ వల్ల చెన్నైకి దెబ్బే: అంబటి రాయుడు

భారీగా పెరుగుతున్న ధోనీ మేనియా సీఎస్కేకు మంచిది కాదని అంబటి రాయుడు ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘చాలా మంది అభిమానులు ధోనీ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియానికి వస్తుంటారు. వారు సీఎస్కే టీమ్లోని మిగతా బ్యాటర్లు త్వరగా ఔటై వెళ్లిపోవాలని కోరుకుంటారు. కొత్త ఆటగాళ్లకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల చెన్నైకి కొత్త నాయకుడు తయారు కావడం కష్టం అవుతుంది’ అని చెప్పారు.
News March 28, 2025
ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్ కేసు(OMC)లో ఎట్టకేలకు విచారణ ముగిసింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు CBI కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులుగా గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. 219 సాక్షులను విచారించడంతోపాటు 3,337 డాక్యుమెంట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతోంది.