News June 25, 2024
పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు

జూలై 1న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఆరోజు సాయంత్రం వారాహి సభ నిర్వహించి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. 3 రోజులు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూ.గో జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటు ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజాదికాలు నిర్వహిస్తారు.
Similar News
News February 8, 2026
బంగ్లా హిందువులకు మద్దతు లభిస్తుంది: RSS

బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై RSS చీఫ్ మోహన్ భాగవత్ శతాబ్ది ఉత్సవాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాలో దాదాపు రూ.1.25 కోట్లమంది హిందువులు ఉన్నారు. వారి హక్కుల కోసం పోరాడాలి అనుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి మద్దతుగా నిలుస్తారు’ అని తెలిపారు. అలాగే ‘RSS చీఫ్ పదవికి విరమణ అనేది ఉండదు. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కూడా రాలేదు. అయితే దిగమంటే దిగిపోతాను’ అని స్పష్టం చేశారు.
News February 8, 2026
బ్రౌన్ షుగర్‌తో ఎన్నో లాభాలు

వైట్ షుగర్ కంటే బ్రౌన్ రంగు షుగర్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. బ్రౌన్ షుగర్ తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లను తగ్గించడానికి, కేలరీలు తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ బి6, నియాసిన్, పాంతోతెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి.
News February 8, 2026
NEET (UG) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

దేశవ్యాప్తంగా UG మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET(UG) 2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో మే 3న ఈ పరీక్ష జరగనుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు ₹1700, EWS, OBC-NCL వారికి ₹1600, SC, ST, PwBD, థర్డ్ జెండర్ ₹1000, ఔట్ సైడ్ ఇండియా అభ్యర్థులకు ₹9500గా ఉంది.
వెబ్‌సైట్: <


