News July 1, 2024
నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: ఎన్నికల గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూ.గో జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News January 6, 2026
కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.
News January 6, 2026
ఇంటర్వ్యూతో ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీ: మంగళగిరిలోని <
News January 6, 2026
రష్యా నుంచి మాకు ఆయిల్ రావడం లేదు: రిలయన్స్

రష్యా నుంచి తమ జామ్‌నగర్ రిఫైనరీకి ముడి చమురు నౌకలు వస్తున్నాయన్న వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖండించింది. వాటిల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. గత 3 వారాలుగా తాము రష్యన్ ఆయిల్ కార్గోను స్వీకరించలేదని, జనవరిలో కూడా అక్కడి నుంచి చమురు వచ్చే అవకాశం లేదని వెల్లడించింది. తాము ముందే క్లారిటీ ఇచ్చినప్పటికీ తప్పుడు కథనాలను పబ్లిష్ చేయడం వల్ల తమ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేసింది.


