News July 7, 2024
జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
AP: రాష్ట్రంలోని NDA సర్కార్కు జనసేన శ్రేణులు వెన్నుదన్నుగా నిలబడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ రూల్స్ను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం కూడా నిబంధనల అతిక్రమణ కిందికే వస్తుందని, అలాంటి వారిపైనా చర్యలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News January 17, 2025
VIRAL: ఇదేందయ్యా ఇది.. స్టూడెంట్ మూవీ రివ్యూ చూశారా?
సాధారణంగా స్కూళ్లలో విద్యార్థులకు సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, దర్శకుడు ఎవరనే విషయాల్లో ప్రశ్నలు అడుగుతారు. కానీ తన కజిన్కు మూవీ రివ్యూను హోంవర్క్గా ఇచ్చినట్లుగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. సలార్ మూవీకి విద్యార్థికి రివ్యూ ఇవ్వగా మా టైమ్లో ఇలాంటి హోమ్ వర్క్ ఉంటే బాగుండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సలార్ క్రేజీ ఇంకా కొనసాగుతోందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు.
News January 17, 2025
రూ.446 కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్
TG: సీఎం రేవంత్ ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖలో రూ.446 కోట్ల పెండింగ్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. వీటిలో రూ.300 కోట్ల ఉపాధి హామీల పనుల బిల్లులు, రూ.146 పారిశుద్ద్య కార్మికుల వేతనాలకు చెల్లించనున్నారు. త్వరలోనే మరిన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ-కుబేర్ ద్వారా పారిశుద్ద్య కార్మికుల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
News January 17, 2025
7 కోట్లు దాటిన భక్తజనం.. రష్యన్ బాబాను చూశారా?
యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. గంగా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానమాచరించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని సమాచారం. ఈ మేళాలో రష్యన్ సాధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడడుగుల ఎత్తున్న ఆయనను పలువురు పరశురాముడిగా పిలుస్తున్నారు. ఆయన టీచింగ్ కెరీర్ను వదిలేసి నేపాల్లో ఉంటున్నారు.