News January 9, 2025

పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు

image

AP: తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఇవాళ కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.

Similar News

News January 9, 2025

మ‌న్ కీ బాత్ వినాల్సిందే: గోవా ప్ర‌భుత్వం

image

అన్ని ప్ర‌భుత్వ శాఖల ఉన్న‌తాధికారులు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌ధాన మంత్రి మ‌న్ కీ బాత్ వినాల‌ని గోవా ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని లేవ‌నెత్తే అంశాలు, స‌ల‌హాల నుంచి స్ఫూర్తి పొందాల‌ని స‌ర్క్యుల‌ర్‌లో పేర్కొంది. ప్ర‌భుత్వ పాల‌న‌ను మెరుగుప‌రిచేందుకు వాటిలో ఉత్త‌మ విధానాల‌ను అమ‌లు చేయాల‌ని సూచించింది. ప్రగతిశీల పాలనా పద్ధతులను అమలు చేయడంలో గోవా మార్గదర్శకమని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.

News January 9, 2025

బాబాయ్-అబ్బాయ్: ఫిర్ ఏక్ బార్ ఏక్ సాథ్?

image

శ‌ర‌ద్ ప‌వార్‌-అజిత్ ప‌వార్ వ‌ర్గాలు తిరిగి ఏక‌మవుతాయ‌న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒక‌వైపు కేంద్ర మంత్రి ప‌ద‌వులు ఆశ‌చూపి శ‌ర‌ద్ వ‌ర్గం MPల‌ను అజిత్ వ‌ర్గం ఆక‌ర్షిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఇద్ద‌రూ క‌ల‌వాల‌ని దేవుణ్ని ప్రార్థించిన‌ట్టు అజిత్ త‌ల్లి ఆశాతాయి పేర్కొన్నారు. MPల ఫిరాయింపు, NDAలో చేరిక‌ను ఇరు వ‌ర్గాలు ఖండిస్తున్నాయి. అయితే కింది స్థాయి నేత‌లు బ‌లంగా కోరుకుంటున్నారు.

News January 9, 2025

అంతరిక్షం నుంచి లాస్ ఏంజెలిస్‌‌ వైల్డ్ ఫైర్ PHOTO

image

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌‌లో కార్చిచ్చు వేలాది ఎకరాలను దహించివేస్తోంది. దావానలంలా వ్యాపిస్తున్న మంటల్లో గ్రామాలన్నీ బూడిదవుతున్నాయి. ఈ వైల్డ్ ఫైర్, పొగ ఏకంగా అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ESA ప్రయోగించిన కోపర్నికస్ సెంటినెల్-2 శాటిలైట్ ఈ అగ్నికీలల ఫొటో తీసింది.