News June 5, 2024
పవన్ వల్లే కూటమి సాధ్యమైంది: చంద్రబాబు

AP: కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణే అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చారని కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒకతాటిపైకి వచ్చి సమష్టిగా పని చేశాయని తెలిపారు. ‘గత ఐదేళ్లలో వ్యవస్థలు, ఎకానమీ కుప్పకూలాయి. ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారు. అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలీదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News January 7, 2026
డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.
News January 7, 2026
ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ‘అలా చేస్తే కడుపులోని జీర్ణ రసాలు పలుచబడతాయి. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటి అధిక పరిమాణం కడుపులో ఒత్తిడిని పెంచి, ఆహారాన్ని అరిగించాల్సిన యాసిడ్ను అన్నవాహికలోకి నెడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత 30-60 నిమిషాలు ఆగి వాటర్ తాగాలి’ అని సూచిస్తున్నారు.
News January 7, 2026
గాయం నుంచి కోలుకొని అదరగొట్టిన శ్రేయస్

భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ VHTలో అదరగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నిన్న ముంబై కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడిన ఆయన 53 బంతుల్లోనే 82 రన్స్ చేశారు. అందులో 10 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. దీంతో ఈ నెల 11 నుంచి NZతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో శ్రేయస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమైనట్లే. గతేడాది AUSలో వన్డే మ్యాచ్ ఆడుతూ గాయపడిన శ్రేయస్ 2 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.


