News August 8, 2024

కర్ణాటక సీఎంతో పవన్ భేటీ

image

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు ఊళ్లలోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చింది. వీటిని అడవుల్లోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉండటంతో కొన్నింటిని ఏపీకి తరలించాలని కోరేందుకు పవన్ బెంగళూరుకు వెళ్లారు.

Similar News

News March 16, 2026

కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచే దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలో 93 KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CETకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ప్రవేశ పరీక్ష మే 3న జరగనుంది. KGBVల్లో సీట్లు పొందిన బాలికలకు జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

News March 16, 2026

OTD: సచిన్ శతకాల ‘సెంచరీ’ చేసిన వేళ!

image

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 14 ఏళ్లు. 2012 మార్చి 16న సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు కొట్టిన తొలి, ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై 114 పరుగులతో ఈ ఘనత అందుకున్నారు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకపోవడం గమనార్హం. ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(85) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.

News March 16, 2026

9/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. ఇరాన్ సంచలన ఆరోపణలు!

image

ఉగ్రదాడికి ఎప్‌స్టీన్ నెట్‌వర్క్ కుట్ర పన్నిందని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లో మిగిలిన సభ్యులు USలో 9/11 తరహా ఘటనను క్రియేట్ చేసి, దానికి ఇరాన్‌ను నిందించాలని ప్లాన్ చేసినట్లు విన్నాను. మేం ఇలాంటి వాటికి వ్యతిరేకం. మా యుద్ధం US ప్రజలతో కాదు’ అని ట్వీట్ చేశారు. 2001 SEP 11న న్యూయార్క్‌ ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన దాడిలో 3వేల మంది చనిపోయారు.