News November 27, 2024
కేంద్ర మంత్రితో పవన్ భేటీ.. ఎర్రచందనంపై చర్చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. ఎర్రచందనం పరిరక్షణపై చర్చించారు. ఏపీ, తమిళనాడులో ఎర్ర చందనం పెరుగుదల, స్వాధీనం చేసుకున్న కలపను ఈ-వేలం వేయడానికి రాష్ట్ర అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించడం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కలపను రాష్ట్రానికి తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.
Similar News
News November 27, 2024
ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు
TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ వద్ద ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పారు.
News November 27, 2024
అదానీ అంశంపై క్యాబినెట్లో చర్చిస్తాం: పవన్
AP: అదానీ వ్యవహారంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పీఎం మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మోదీతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని మీడియాతో పవన్ చెప్పారు.
News November 27, 2024
రూ.40 వేల కోట్లు వదిలేసుకుని..
వెన్ అజాన్ సిరిపన్యో బౌద్ధ సన్యాసి. ఇతని తండ్రి ఆనంద కృష్ణన్ మలేషియాలోని టాప్-3 ధనవంతుల్లో ఒకరు కాగా తల్లిది థాయ్ రాయల్ ఫ్యామిలీ. 18ఏళ్ల వయసులో థాయ్లాండ్ వెళ్లిన సిరిపన్యో సరదాగా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆపై దానికే జీవితాన్ని అంకితం చేసి రూ.40వేల కోట్ల వారసత్వ ఆస్తిని త్యజించాడు. అప్పుడప్పుడు కుటుంబాన్నికలిసే సిరిపన్యో పాత జీవితం తాత్కాలికమైందని చెబుతుంటారంట. ఇతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.