News June 7, 2024
భారీ ధరకు పవన్ ‘ఓజీ’ ఓటీటీ రైట్స్?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.90 కోట్లకుపైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Similar News
News September 12, 2025
భారత్‌తో మ్యాచ్.. పాక్ కోచ్ ఏమన్నారంటే?

ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న జరిగే IND, PAK మ్యాచులో రిస్ట్ స్పిన్నర్ల మధ్యే పోటీ ఉంటుందన్న అభిప్రాయాలపై PAK కోచ్ మైక్ హెసన్ స్పందించారు. ‘దుబాయ్ పిచ్ స్పిన్‌కు అంతగా సహకరిస్తుందని అనిపించడం లేదు. UAEతో మ్యాచులో కుల్దీప్ యాదవ్ బాల్‌ను ఎక్కువగా స్పిన్ చేయలేదు. రిస్ట్ స్పిన్నర్లుంటే సర్ఫేస్తో పనిలేదు. మా జట్టులోనూ ఐదుగురు స్పిన్నర్లున్నారు. నవాజ్ వరల్డ్‌లోనే బెస్ట్ స్పిన్నర్’ అని పేర్కొన్నారు.
News September 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 12, 2025
సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం (ఫొటోలో లెఫ్ట్)
1967: నటి అమల అక్కినేని జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (ఫొటోలో రైట్)
2009: BCCI మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
2024: తెలుగు గీత రచయిత గురుచరణ్ మరణం