News December 29, 2024
విచారణకు పవన్ ఆదేశం.. రంగంలోకి అధికారులు
AP: కాకినాడ వాకలపూడి తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. తాబేళ్ల మృతికి గల కారణాలను తెలుసుకోవాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కాకినాడ తీరంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని PCB అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.
Similar News
News January 1, 2025
2025: ఈ హీరోల ఫ్యాన్స్‌కు ఎదురుచూపులే!
కొత్త ఏడాదిలో స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు ఎదురు చూపులే మిగలనున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇంకా సూపర్ స్టార్ మహేశ్-రాజమౌళి షూట్ ప్రారంభం కావాల్సి ఉంది. ‘పుష్ప-2’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఎన్టీఆర్ వార్-2తో వచ్చినా ఆ మూవీ బాలీవుడ్‌కే ఎక్కువగా పరిమితమయ్యే అవకాశముంది.
News January 1, 2025
Stock Markets: న్యూఇయర్‌లో శుభారంభం
2025 మొదటి సెషన్లో బెంచ్‌మార్క్ సూచీలు భారీగా లాభపడ్డాయి. AUTO, MEDIA, CONSUMPTION షేర్లు దన్నుగా నిలవడంతో సెన్సెక్స్ 78,507 (+368), నిఫ్టీ 23,742 (+98) వద్ద ముగిశాయి. మెటల్, రియాల్టి మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. MARUTI, M&M, LT, BAJAJFIN, TATAMOTORS టాప్ గెయినర్స్. HINDALCO, DRREDDY, ADANIPORTS, ONGC, TATASTEEL టాప్ లూజర్స్. ఫియర్ ఇండెక్స్ INDIA VIX 14.51 వద్ద ఉండటం అనిశ్చితిని సూచిస్తోంది.
News January 1, 2025
మొన్న సుభాష్ నిన్న పునీత్: భార్యాబాధితులు బతికేదెలా?
కాలం మారింది. మగాడు బలహీనుడయ్యాడు. భార్య అండగా నిలిస్తే కొండలైనా పిండిచేయగలిగే భర్త ఆమె వేధిస్తే తట్టుకోలేకపోతున్నాడు. చట్టాలన్నీ అవతలివారికే చుట్టాలుగా మారడంతో గిలగిలా తన్నుకుంటున్నాడు. ఎంత పోరాడినా న్యాయం దొరకదేమోనన్న బెంగతో ప్రాణం తీసేసుకుంటున్నాడు. మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్. నిన్న ఢిల్లీలో పునీత్ ఖురానా. విడాకుల విచారణలో నలిగిపోతున్న భార్యాబాధితులు బతికేదెలా? భరోసా దొరికేదెలా? మీ comment.