News June 4, 2024

విజయవాడ చేరుకున్న పవన్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు బయల్దేరారు. కౌంటింగ్ సరళిపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించే ఛాన్సుంది. అనంతరం ఇవాళ రాత్రికి టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని భేటీ కానున్నారు.

Similar News

News November 21, 2025

కడప కలెక్టరేట్‌లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

image

కడప కలెక్టరేట్‌లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్‌ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

News November 21, 2025

టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

image

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్‌లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

News November 21, 2025

కొత్త లేబర్ కోడ్‌లో ఉపయోగాలు ఇవే..

image

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్లు
* ఫిక్స్‌ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి