News February 25, 2025
ఏనుగుల దాడి ఘటనపై స్పందించిన పవన్

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి ఘటనపై<<>> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ను అసెంబ్లీ నుంచి హుటాహుటిన వై.కోట వెళ్లాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
Similar News
News February 25, 2025
హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి!

* మీరు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయినప్పటికీ, వినయంగా ఉండండి
* ఇతరుల సంక్షేమం కోసం మీ అధికారాలను ఉపయోగించండి
* ఇంద్రియాలను మీరు నియంత్రించాలి. అవి మిమ్మల్ని నియంత్రించకూడదు
* పాపాలు చేసే వారి పట్ల దయ చూపొద్దు
* నిర్భయంగా, నమ్మకంగా ఉండండి
* క్రమం తప్పకుండా శారీరక & మానసిక బలాన్ని మెరుగుపరుచుకోండి
News February 25, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: బండి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ బీజేపీనే గెలుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసి CM హడావుడిగా ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతోందని దుయ్యబట్టారు. కులగణన తప్పుగా సాగిందని, 32శాతమే రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు.
News February 25, 2025
పెళ్లై ఏడేళ్లు.. ఒకే కాన్పులో ముగ్గురు జననం

TG: గజ్వేల్ సమీపంలోని అడవిమజీద్కు చెందిన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. నర్సింహులుతో నాగరత్నకు వివాహమవ్వగా ఏడేళ్లుగా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా గర్భం దాల్చింది. ఆదివారం ఆమెకు గజ్వేల్ ఆసుపత్రిలో ప్రసవం జరగగా ఇద్దరు మగ, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.