News August 5, 2025

పవన్ సార్.. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే: హరీశ్ శంకర్

image

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో షూటింగ్ పూర్తయినట్లు హరీశ్ తాజాగా ప్రకటించారు. ‘మాటిస్తే నిలబెట్టుకుంటారు. మాట మీదే నిలబడతారు. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే. ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది’ అని పేర్కొంటూ హీరోతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. పవన్ అందించిన ఎనర్జీ, సపోర్ట్‌తో షూటింగ్‌‌ను పూర్తి చేశామన్నారు.

Similar News

News August 5, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. ఒక్క రోజే ఖాతాల్లోకి ₹130 కోట్లు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.700 కోట్లు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3.08 లక్షల ఇళ్లు మంజూరు కాగా 1.77 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ కింద అందించే రూ.5 లక్షలను 4 దశల్లో ఇళ్ల స్టేటస్‌లను బట్టి ప్రతీ సోమవారం ఖాతాల్లో జమ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ.130 కోట్లను బదిలీ చేశారు.

News August 5, 2025

ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న సూర్య!

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే నెల 9 నుంచి జరిగే ఆసియా కప్ కోసం రెడీ అవుతున్నారు. జూన్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం BCCI మెడికల్ స్టాఫ్ పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. సర్జరీ తర్వాత తొలి సారిగా గత వారం ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా సూర్య చివరగా జూన్‌లో ముంబై టీ20 లీగ్‌లో ఆడారు.

News August 5, 2025

E20 పెట్రోల్‌తో ముప్పు ఉందా? కేంద్రం ఏం చెప్పిందంటే?

image

E20 పెట్రోల్‌తో పాత వాహనాలకు <<17278950>>ముప్పు<<>> కలుగుతుందన్న దానికి శాస్త్రీయ ఆధారాల్లేవని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. ‘కార్బ్యురేటెడ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ వాహనాలపై టెస్టులు జరిగాయి. పవర్, టార్క్ ఉత్పత్తి, ఇంధన వినియోగంలో పెద్దగా తేడా లేదని అంతర్జాతీయ అధ్యయనాల్లో తేలింది. ఇంజిన్‌లకూ నష్టం లేదని నిర్ధారణ అయింది. పాత వాహనాల్లో రబ్బర్ పార్ట్స్, గాస్కెట్స్ మారిస్తే సరిపోతుంది. అవి చౌకైనవే’ అని పేర్కొంది.