News June 14, 2024
ప్రధాని, కేంద్ర మంత్రులకు పవన్ కృతజ్ఞతలు

AP: దేశంలో, రాష్ట్రంలో NDA కూటమి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు మంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మోదీతోపాటు అమిత్ షా, గడ్కరీ, నడ్డా, రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మన్సుఖ్ మాండవీయ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, సింధియాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు.
Similar News
News October 22, 2025
‘కార్తీక మాసం’ అనే పేరెందుకు?

నక్షత్ర గమనం ఆధారంగా ఈ మాసానికి కార్తీక మాసం అనే దివ్య నామం సిద్ధించింది. శరదృతువులో వచ్చే ఈ పుణ్య మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో కృత్తికా నక్షత్రం వద్ద సంచరిస్తాడు. అందువల్లే ఈ మాసానికి ‘కార్తీక’ అని పేరు వచ్చింది. తెలుగు మాసాలలో ఈ మాసం అతి పవిత్రమైనది. ‘న కార్తీక నమో మాసః’ అంటే కార్తీకానికి సమానమైన మాసం లేదని పురాణాలు కీర్తిస్తున్నాయి. శివకేశవుల అనుగ్రహం పొందడానికి ఈ మాసం ఉత్తమమైనది.
News October 22, 2025
2,570 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RRB 2,570 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.rrbapply.gov.in
News October 22, 2025
జైషే మహ్మద్ మరో కుట్ర?

పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏర్పాటైన <<17958042>>మహిళా వింగ్ <<>>కోసం రిక్రూట్మెంట్, నిధులు సేకరించేందుకు ఆన్లైన్ జిహాదీ కోర్స్ ప్రారంభించినట్లు సమాచారం. జైషే చీఫ్ మసూద్ సిస్టర్స్ సాదియా, సమైరా, మరికొందరు రోజూ 40నిమిషాలు పాఠాలు చెప్తారని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేవారు 500 పాక్ రుపీస్ డొనేషన్ ఇవ్వాలంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.