News April 7, 2025
నేటి నుంచి ‘అడవితల్లి బాట’.. ప్రారంభించనున్న పవన్

AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సర్కారు ‘అడవితల్లి బాట’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. గిరిజన గ్రామాల అనుసంధానం, రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధిపై ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.
Similar News
News April 9, 2025
నేటి నుంచి అమల్లోకి అమెరికా టారిఫ్స్

భారత ఎగుమతులపై యూఎస్ టారిఫ్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికాకు ఎగుమతి చేస్తున్న అన్ని వస్తువులపై ఆ దేశం 26% సుంకాలు వసూలు చేయనుంది. దీంతో ఎగుమతిదారులపై ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుంది. ఇవాళ భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం సుంకాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా టారిఫ్స్‌తో ఇప్పటికే రోజుకు $2 బిలియన్ల కలెక్షన్లు వస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
News April 9, 2025
జగన్‌వేనా.. పైలట్‌వి ప్రాణాలు కావా?: అనిత

AP: మాజీ సీఎం జగన్ కావాలనే హెలికాప్టర్‌లో ప్రయాణించలేదని, సాంకేతిక సమస్య ఉంటే పైలట్ ఎలా వెళ్లారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. జగన్‌వేనా ప్రాణాలు.. పైలట్‌వి కావా అని ఆమె నిలదీశారు. ‘వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు పెట్టుకున్నారు. జగన్ స్థాయికి తగ్గట్లు భద్రత ఏర్పాటు చేశాం’ అని ఆమె పేర్కొన్నారు.
News April 9, 2025
IPL: తగ్గేదేలే.. విధ్వంసమే

గత రెండు రోజుల్లో జరిగిన 3 ఐపీఎల్ థ్రిల్లర్ మ్యాచ్‌లు అభిమానులకు మజానిచ్చాయి. 200కు పైగా పరుగులు చేసి ఆరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు పోరాడాయి. సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లు తగ్గేదేలే అంటూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొన్న RCB 221/5 స్కోర్ చేస్తే MI 209/9 పరుగులు చేసింది. నిన్న LSG విసిరిన 239 పరుగుల సవాల్‌కు KKR(234) దీటుగా బదులిచ్చింది. PBKS 219/6 స్కోర్ చేస్తే CSK 201/5 రన్స్ చేసింది.