News September 2, 2025

ఈ నెల 5న అరకులో పర్యటించనున్న పవన్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 5న అరకులోని మాడగడ గిరిజన గ్రామంలో పర్యటిస్తారని జనసేన ప్రకటనలో తెలిపింది. ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో పాల్గొంటారని పేర్కొంది. 12 రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ వేడుకలు గత నెల 25న ప్రారంభమయ్యాయి. గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజున పవన్ హాజరవుతారని వెల్లడించింది. ఆంధ్ర సరిహద్దుల్లోని ఈ గ్రామంలో జరిగే ఉత్సవాల్లో ఒడిశా ఆదివాసీలూ పాల్గొంటారు.

Similar News

News September 3, 2025

పెరిగిన డిస్కౌంట్.. మరింత చౌకగా రష్యన్ ఆయిల్

image

భారత్‌కు క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా లభించనుంది. రష్యా డిస్కౌంట్స్ పెంచడమే ఇందుకు కారణం. బ్యారల్ ధరపై 3-4 డాలర్ల మేర ధర తగ్గనుంది. ప్రస్తుతం IND రోజుకు 5.4 మిలియన్ల బ్యారళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అందులో 36% రష్యా నుంచే కొంటోంది. ఓవైపు ట్రంప్ 50% టారిఫ్స్‌తో ఒత్తిడి తెస్తున్నా భారత్‌ వెనక్కి తగ్గకుండా రష్యా, చైనాకు మరింత దగ్గరవుతోంది. తాజాగా చైనాలో జరిగిన SCO సమ్మిట్‌తో అది స్పష్టమైంది.

News September 3, 2025

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు ప్రభుత్వం!

image

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా SEP 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే.

News September 3, 2025

నేటి నుంచి GST కౌన్సిల్ సమావేశాలు

image

రెండు రోజుల పాటు జరిగే GST కౌన్సిల్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే మీటింగ్‌లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొంటారు. GSTలో ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులను 2(5%, 18%)కు తగ్గించాలన్న కేంద్రం ప్రతిపాదనపై చర్చించి ఆమోదించనున్నారు. శ్లాబులు తగ్గించడం ద్వారా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.