News June 11, 2024

చంద్రబాబును CM అభ్యర్థిగా ప్రతిపాదించనున్న పవన్!

image

AP: కాసేపట్లో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలంతా గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమికి ఆయన ఆహ్వానం పంపనున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

Similar News

News December 25, 2024

ఆడపిల్లలకు స్కూటీలు ఏవి రేవంత్?: కవిత

image

TG: రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనా రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ‘రైతులు పండించే పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతు భరోసా రాలేదు. క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాల ఊసే లేదు. మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు’ ఆమె ఫైర్ అయ్యారు.

News December 25, 2024

వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు: TTD

image

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్ని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. వచ్చే నెల 8న ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేకంగా టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.

News December 25, 2024

జానీ మాస్టర్‌కు మరో షాక్

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు అందులో పేర్కొన్నారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెను వేధించినట్లు నిర్ధారించారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్నారు.