News November 26, 2024
పవన్ ఢిల్లీ టూర్.. ఇవాళ వరుస భేటీలు
AP: రెండు రోజుల పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, లలన్ సింగ్తో వరుసగా భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్లో ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు.
Similar News
News November 26, 2024
ఢిల్లీని వీడుతూ పంత్ ఎమోషనల్ పోస్ట్
IPL వేలంలో లక్నోకు వెళ్లిపోయిన రిషభ్ పంత్ ఢిల్లీ అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘టీనేజర్గా ఇక్కడ అడుగుపెట్టి 9 ఏళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అందుకు అభిమానులే కారణం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. కఠిన సమయాల్లో అండగా ఉన్నారు. వేరే జట్టుకు వెళ్తున్నా మీ ప్రేమను గుండెలో పదిలంగా దాచుకుంటా. మిమ్మల్ని ఎప్పటిలాగే అలరిస్తా’ అని పంత్ రాసుకొచ్చారు.
News November 26, 2024
మోదీ స్ఫూర్తితో రాజ్యాంగ దినోత్సవం: స్పీకర్ ఓంబిర్లా
ప్రజల కొన్నేళ్ల తపస్సు, త్యాగం, చాతుర్యం, బలం, సామర్థ్యాల ఫలితమే రాజ్యాంగమని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. భౌగోళిక, సామాజిక వైవిధ్యాలను ఒకే దారంలో కూర్చేందుకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో మూడేళ్లు శ్రమించామని తెలిపారు. PM మోదీ స్ఫూర్తితో 2015 నుంచి NOV 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నేడు కోట్లాది మంది కృతజ్ఞతా పూర్వకంగా రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేస్తున్నారని వెల్లడించారు.
News November 26, 2024
రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి
రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవ విషెస్ తెలిపిన ఆమె చరిత్రాత్మక ఘటనలో దేశ పౌరులందరూ భాగస్వాములు అవుతున్నారన్నారు. ‘75ఏళ్ల క్రితం ఇదే రోజు రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి పొందుపరిచారు’ అని చెప్పారు.