News September 22, 2025
పవన్ అభిమానులకు ఇంకా నిరీక్షణే..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్ననే ట్రైలర్ రావాల్సి ఉండగా పలు కారణాలతో రిలీజ్ కాలేదు. అయితే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రాకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ఛాన్స్ ఉండటంతో రెండు రోజులు ముందు విడుదల చేస్తే ఎలా అని అంటున్నారు. ఇలాంటివి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారు.
Similar News
News September 22, 2025
రోజూవారి అమ్మవారి అలంకరణ

Day 1- గులాబీ రంగు చీర, మందారాలు
Day 2- నారింజ రంగు చీర, తామర/కలువ పూలు
Day 3- నీలం రంగు చీర, మల్లెలు
Day 4- పసుపు రంగు చీర, మందారాలు, మల్లెలు
Day 5- గులాబీ రంగు చీర, ఎర్ర గులాబీలు, కలువలు
Day 6- పసుపు చీర, గులాబీలు, Day 7- బంగారు రంగు చీర, పసుపు రంగు పూలు, Day 8- తెల్ల చీర, తెల్ల తామర, Day 9- ఎర్ర చీర, ఎర్ర పూలు, Day 10- నీలం చీర, శంఖు పూలు
Day 11- ఆకుపచ్చ చీర, కలువ పూలు
News September 22, 2025
13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును IBPS ఈ నెల 28 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. CBT, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఎంపిక ఉంటుంది. కనీసం డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో 152, తెలంగాణ గ్రామీణ్ బ్యాంక్‌లో 798 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News September 22, 2025
నేటి నుంచి దుర్గా నవరాత్రులు.. బాలాత్రిపుర సుందరీగా అమ్మవారు

దేశవ్యాప్తంగా నేటి నుంచి దుర్గామాత నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై, వరంగల్‌లోని భద్రకాళి ఆలయాల్లో 11 రోజుల పాటు అమ్మవార్లు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవీగా కనిపించనున్నారు. అటు శ్రీశైలంలో భ్రమరాంభికా దేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తారు. కాగా నేడు 2-10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.