News October 12, 2025

ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

image

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 12, 2025

జంతువులకు కూడా జ్యోతిషం వర్తిస్తుందా?

image

జ్యోతిషం అంటే భవిష్యత్తును చెప్పే శాస్త్రమే కాదు. కర్మ సిద్ధాంతాన్ని వివరించే దివ్య దర్శనం కూడా! ఈ శాస్త్రం జరగబోయే కష్టసుఖాలను తెలుపుతుంది. జీవులు ఏ రూపంలో ఉన్నా పాపపుణ్యాల మిశ్రమ ఫలితాలను పసిగట్టగలిగే శక్తి దీనికి ఉంది. అండజం(గుడ్డు నుంచి), పిండజం(గర్భం నుంచి), ఉద్భిజం(భూమి నుంచి) వంటి ఏ రూపంలో జన్మించినా, పుట్టుక నుంచి మరణం వరకు అనుభవించే కాలాన్ని, ఫలితాలను ముందే చెప్పగలదు. <<-se>>#Jyothisham<<>>

News October 12, 2025

CERSAIలో భారీ జీతంతో ఉద్యోగాలు

image

సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్& సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా(CERSAI) 11పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BCA, MCA, B.Tech, MBA, PGDM, M.TECH, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మేనేజర్‌కు ₹40వేలు నుంచి ₹1.40లక్షల వరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు ₹70వేల- ₹2లక్షల వరకు జీతం చెల్లిస్తారు.

News October 12, 2025

నేడు విశాఖలో డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన

image

AP: మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సిఫీ AI డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ IT కంపెనీ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థే ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్. ఇది రూ.1500 కోట్లతో రెండు దశల్లో 50 మెగావాట్ల AI ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయనుంది. దీంతో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.