News April 22, 2024
రేపు పవన్ నామినేషన్

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం నామినేషన్ సమర్పిస్తారు. మరోవైపు రేపు ఉత్తరాంధ్రలో, ఎల్లుండి రాయలసీమలో పవన్, చంద్రబాబు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు.
Similar News
News March 23, 2026
రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి.. నేడు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు CM CBN ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి Dy.CM పవన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 1.25L మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 2033కు పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం.
News March 23, 2026
హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.
News March 23, 2026
మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

హై BP గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్‌లో ఉంటుంది.


