News January 9, 2025
పవన్ ‘OG’ టీజర్ విడుదలకు సిద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘OG’ నుంచి టీజర్ వీడియో విడుదలకు సిద్ధమైంది. 99 సెకండ్ల నిడివితో కూడిన టీజర్కు సెన్సార్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News November 3, 2025
శివయ్య భక్తులకు TGRTC శుభవార్త

కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు TGRTC శుభవార్త చెప్పింది. నేరుగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. HYD దిల్షుక్నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ఈ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నేరుగా చేరుకోవడానికి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
News November 3, 2025
కర్నూలు పవర్ ప్రాజెక్టుకు ₹7500 కోట్ల REC ఫండింగ్

AP: బ్రూక్ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ సంస్థ ‘ఎవ్రెన్’ కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసే పవర్ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థ REC ₹7500 కోట్లు అందించనుంది. ప్రైవేటు ప్రాజెక్టులో ఆర్ఈసీ అందించే అతిపెద్ద ఫండింగ్ ఇదే. 1.4 GW హైబ్రిడ్ ప్రాజెక్టుకు బ్రూక్ఫీల్డ్ ₹9910 కోట్లు వ్యయం చేయనుంది. ఎవ్రెన్ సంస్థలో 51.49% వాటా ఉన్న ఆ సంస్థ ఏపీలో మొత్తంగా 3 WG పవర్ ప్రాజెక్టుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
News November 3, 2025
PHOTO OF THE DAY

భారత మహిళా జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలవడంతో 140కోట్ల మంది భారతీయుల కళ్లు చెమ్మగిల్లాయి. ఈ భావోద్వేగ సమయంలో స్టేడియంలోనూ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కెప్టెన్ కౌర్, తమ <<18182384>>కోచ్<<>> అమోల్ మజుందార్ పాదాలను తాకి కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. ఇది గురు-శిష్యుల బంధాన్ని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించినా అమోల్కు అప్పట్లో INDకి ఆడే ఛాన్స్ రాకపోవడం గమనార్హం.


