News December 30, 2024

CM రేవంత్‌పై పవన్ ప్రశంసలు.. కేంద్ర మంత్రి కౌంటర్

image

CM రేవంత్ గొప్ప నాయకుడని <<15019113>>కొనియాడిన<<>> Dy.CM పవన్ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు. రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ చెప్పాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినట్టు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ‘అల్లు అర్జున్ కోసమే అసెంబ్లీ పెట్టినట్లు ఉంది. పుష్ప-2 విడుదలకు ముందే రేవంత్ సినిమా చూపించారు. వారిమధ్య 14% కమీషన్ దగ్గర చెడినట్లుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

image

HYDలోని CSIR-<>NGRI<<>> 14 ప్రాజెక్ట్ అసోసియేట్, Sr ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు DEC 9న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MSc(Tech)/M.Tech/MS/ఇంటిగ్రేటెడ్ M.Tech/PhD/GATE/NET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 35ఏళ్లు, Sr ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 40ఏళ్లు. వెబ్‌సైట్: https://www.ngri.res.in

News December 1, 2025

రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

image

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.

News December 1, 2025

నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

image

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.