News April 8, 2025

పవన్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన YS జగన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ <<16028483>>అగ్నిప్రమాదంలో <<>>గాయపడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాకయ్యా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని జగన్ Xలో రాసుకొచ్చారు.

Similar News

News April 17, 2025

టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ నియామకం

image

AP: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ఆ పార్టీ అధిష్ఠానం కమిటీని నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా సీనియర్ నేత వర్ల రామయ్యను ఎంపిక చేసింది. సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవితమ్మ, దగ్గుమళ్ల ప్రసాదరావును నియమించింది. TDP అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

News April 17, 2025

నేడే జేఈఈ మెయిన్ ఫలితాలు

image

JEE మెయిన్ ఫలితాలను నేడు NTA విడుదల చేయనుంది. 2 సెషన్లు పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇస్తామని తెలిపింది. అధికారిక సైట్‌లో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి <>ఫలితాలు<<>> తెలుసుకోవచ్చు. మరోవైపు JEE అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 23 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుండగా, మే 18న ఎగ్జామ్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా 12 లక్షలు, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది ఈ పరీక్ష రాశారు.

News April 17, 2025

5 సూపర్ ఓవర్లు ఆడి.. నాలుగింట విజయం

image

IPL: నిన్న RRపై సూపర్ ఓవర్‌లో గెలుపుతో ఢిల్లీ అరుదైన ఘనత సాధించింది. IPLలో ఇప్పటి వరకు 5 సార్లు సూపర్ ఓవర్లు ఆడి, నాలుగు మ్యాచుల్లో గెలిచిన జట్టుగా నిలిచింది. 2013లో ఒక్కసారే బెంగళూరుపై ఓడింది. గతంతో ఈ రికార్డ్ 3 విజయాలతో పంజాబ్ పేరిట ఉండేది. మొత్తానికి DC 2019లో కోల్‌కతా, 2020లో పంజాబ్, 2021లో హైదరబాద్, నిన్న RRపై సూపర్ ఓవర్లో విజయాలు అందుకుంది.

error: Content is protected !!