News February 10, 2025
ఎల్లుండి నుంచి పవన్ ఆధ్యాత్మిక యాత్ర

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఈ నెల 12 నుంచి 14 వరకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. అనంతపద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలను ఆయన సందర్శించనున్నారు.
Similar News
News November 9, 2025
ఇదే జోరు కొనసాగితే 2027కి పోలవరం పూర్తి: అతుల్ జైన్

AP: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతున్నాయని పీపీఏ సీఈవో అతుల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో పనులను, టెస్టింగ్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. అలాగే నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు నిధుల ఢోకా లేదని, ఇదే జోరు కొనసాగితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు.
News November 9, 2025
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 110 పోస్టులు

<
News November 9, 2025
మనిషికి సంస్కారం ఎందుకు ఉండాలి? అదెలా వస్తుంది?

శరీర మలినాన్ని స్నానం తొలగించినట్లే, జీవులకు అంటిన అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి, సద్గుణాలు ప్రసాదించేదే నిజమైన సంస్కారం. ఈ కర్మ బాహ్య శుద్ధి కాదు, ఆత్మ శుద్ధి. మనస్సుకు, బుద్ధికి జ్ఞానంతో సంస్కారం చేయడం ద్వారానే మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు. ఆచారాలు, సత్కర్మల ద్వారా మనసును సంస్కరించుకుని, ఉత్తమ జీవనం సాగించడమే మన లక్ష్యం. సంస్కారాన్ని తల్లిదండ్రులు, వేదాల పఠనంతో పొందవచ్చు. <<-se>>#VedikVibes<<>>


