News March 31, 2025
పవన్ సూచన.. పిఠాపురంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో జనసేన నేతలు పిఠాపురంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక నేతలు ముస్లిం ఇమామ్లను సత్కరించారు. రంజాన్ తోఫాలు అందజేశారు. ఈ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Similar News
News January 21, 2026
తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. 36 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఈసీ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసింది. ప్రమోషన్లు, పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో పలువురిని జీహెచ్ఎంసీకి పంపగా మరికొందరిని జిల్లాలకు బదిలీ చేసింది.
News January 21, 2026
‘బంగారు’ భవిష్యత్తు కోసం చిన్న పొదుపు!

ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. అందుకే ఒకేసారి కొనలేకపోయినా ప్రతిరోజూ చిన్న మొత్తంలో డిజిటల్ గోల్డ్ కొనడం లేదా జువెలరీ షాపుల స్కీమ్స్లో చేరడం మంచిది. ఇప్పుడు గోల్డ్ SIPల ద్వారా రోజుకు రూ.30 నుంచే బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా జమ చేయడం వల్ల భవిష్యత్తులో పెరిగే ధరల లాభం మీకే దక్కుతుంది. భారీ పెట్టుబడి అవసరం లేకుండానే చిన్న పొదుపుతోనే ఎంతో కొంత బంగారం కొనొచ్చు.
News January 21, 2026
గనుల కేటాయింపుపై ఎంక్వైరీకి సిద్ధమా.. పొన్నం సవాల్

TG: సింగరేణి గనుల కేటాయింపులపై హరీశ్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 2014 నుంచి 2026 వరకు జరిగిన గనుల కేటాయింపులపై ఎంక్వైరీకి సిద్ధమని, మరి మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు.


