News April 20, 2024

పవన్‌కు తగ్గని జ్వరం.. జనసేన కీలక విజ్ఞప్తి

image

AP: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి, ప్రచారంలో శ్రేణులకు జాగ్రత్తలపై జనసేన కీలక ప్రకటన చేసింది. ‘రికరెంట్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి పవన్ నిత్యం ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దు. షేక్‌హ్యాండ్స్, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖంపై పడకుండా చూడండి’ అని కోరింది.

Similar News

News March 31, 2026

రోహిత్ శర్మ ₹214 కోట్ల సామ్రాజ్యం

image

రోహిత్ శర్మ కేవలం గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా ‘హిట్ మ్యాన్’లాగే బతుకుతున్నారు. ₹214 కోట్ల నెట్‌వర్త్ ఉన్న ఈ క్రికెటర్ ముంబైలో లగ్జరీ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అహుజా టవర్స్‌లో ఉన్న ఈ ఇంటి నుంచి సీ-వ్యూ అద్భుతంగా ఉంటుంది. మోడ్రన్ ఇంటీరియర్స్, పీస్‌ఫుల్ గార్డెన్, క్లాసీ పూజా ఏరియాతో ఈ ఇల్లు కలల సౌధాన్ని తలపిస్తుంది. క్రికెట్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆయన రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.

News March 31, 2026

BIG ALERT: వడగళ్ల వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల <<19520557>>వర్షాలు<<>> కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటలలోపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది.

News March 31, 2026

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం

image

భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆయన బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అయితే పేస్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో ఆయన TMCలో చేరి తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు.