News October 31, 2024
రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన
AP: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పర్యటించనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్‌ను లబ్ధిదారులకు ఆయన అందిస్తారు. కాగా ఈ స్కీమ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం వర్తిస్తుందని తెలిపారు. వినియోగదారులు 1967 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
Similar News
News November 16, 2024
దావాలో మైక్రోసాఫ్ట్‌ను చేర్చిన మస్క్
ఓపెన్ ఏఐపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దావాలోకి మైక్రోసాఫ్ట్‌ను, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మ్యాన్‌ను చేర్చారు. ఒకప్పుడు ఆ సంస్థలో ఉన్న మస్క్ 2018లో బయటికొచ్చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్ అందులో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయితే, తమ పోటీ ఏఐ యాప్‌లలో పెట్టుబడి పెట్టకుండా ఇన్వెస్టర్లను చాట్ జీపీటీ అడ్డుకుంటోందంటూ మస్క్ కోర్టుకెక్కారు.
News November 16, 2024
నాకు ఐఐటీ చదివే కొడుకున్నాడు: తమన్
సంగీత దర్శకుడు తమన్ తన పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తన కుమారుడు ఐఐటీలో చదువుతున్నారని వెల్లడించారు. ‘మా అబ్బాయి ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నా సోషల్ మీడియా ఖాతాలను, సంగీత సంబంధిత వ్యవహరాలను నా భార్యే చూసుకుంటుంది. నాకు డబ్బు కావాలన్నా తననే అడుగుతాను. మా కుటుంబమంతా ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నాం’ అని తెలిపారు.
News November 16, 2024
జో బైడెన్‌లాగే మోదీకీ మతిపోయిందేమో: రాహుల్
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌లానే ప్రధాని మోదీకి మెమరీ లాస్ అయిందని LoP రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని పేర్కొంది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో’ అని మహారాష్ట్ర సభలో అన్నారు.