News December 29, 2025

Pawar PoliTricks: అబ్బాయ్-బాబాయ్ కలిశారు

image

మహారాష్ట్రలో ఫ్యామిలీస్ రీయునైట్ అవుతున్నాయి. మొన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల కోసం ఠాక్రే సోదరులు కలిస్తే నిన్న పింప్రీ పీఠానికై పవార్స్ ఒకే పరివార్ అని ప్రకటించుకున్నారు. పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన NCP, బాబాయ్ శరద్ పవార్ NCP (SP)లు కలిసి పోటీ చేస్తాయని అజిత్ పవార్ ప్రకటించారు. 1999-2017 వరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ అవిభాజ్య NCP చేతిలో ఉండేది.

Similar News

News December 31, 2025

పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి చాలా ప్రమాదకరమైనది. పశువుల షెడ్‌లోని అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల పాలిచ్చే పశువులకు ఇది సోకే అవకాశం ఎక్కువ. పొదుగు వాచిపోవడం, పాలు నీరులా మారడం, విరగడం, అందులో తెల్లటి ముక్కలు కనిపించడం, పశువులు పాలు పిండనీయకపోవడం వంటి లక్షణాలను బట్టి పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. పొదుగువాపు వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గుతుంది.

News December 31, 2025

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టితో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు ముగియనుంది. దానిని MAR31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉపసంచాలకులు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్, ఆపై చదువులు చదువుతున్న అర్హులైన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి రెన్యువల్/ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 31, 2025

ట్రంప్, చైనా కామెంట్స్‌పై మోదీ స్పందించాలి: కాంగ్రెస్

image

ఇండియా-పాక్ మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం చేశామని <<18718800>>చైనా చేసిన<<>> కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘తానే యుద్ధాన్ని ఆపినట్టు పలు వేదికల్లో US అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు చెప్పారు. తామే మధ్యవర్తిత్వం వహించామని ఇప్పుడు చైనా ఫారిన్ మినిస్టర్ చెబుతున్నారు. వాళ్లు చేస్తున్న కామెంట్లు మన దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నట్టు ఉన్నాయి’ అని చెప్పారు.